కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన ‘వివాహాభోజనంబు’ సినిమాను మంచి ఆఫర్ తో ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్య విడుదలైన ఎస్.ఆర్. కళ్యాణమండపం మంచి వసూళ్లు రాబట్టడంతో ఓటీటీ అగ్రిమెంట్ లో మార్పులు చేయడానికి చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులు కూడా థియేటర్ కు వస్తున్నారు. ఈ సినిమాను థియేటర్ లో చూస్తే ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే అవకాశం వుంది. రాబటి కూడా బాగా వుంటుంది అనే ఉద్దేశ్యంతో ఓటీటీ అగ్రిమెంట్ లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. సత్య ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. త్వరలోనే చిత్ర నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించే అవకాశం వుందని చిత్ర సన్నిహితులు చెబుతున్నారు.
Social Plugin