టాలీవుడ్ సమస్యలను చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నుంచి చిరంజీవికి పిలువు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల సినీ ప్రముఖులతో మెగాస్టార్ తన నివాసంలో సమావేశమయ్యారు. దీని మీద కొందరు నిర్మాతలు విమర్శలు లేవనెత్తుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అనేది హెడ్ గా వుంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ దానికి కో ఆర్డినేషన్ గా వుంటాయి. ప్రభుత్వాలతో ఏ సమస్యలపై చర్చించాలన్నా వీటి పేరు మీదుగానే రిప్రెజెంటేషన్ ఇస్తారు. అంటూ వాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో మెగా అభిమానులు పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ యదాతథంగా మీకోసం….
మెగాస్టార్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్న నిర్మాతలకు ఇవే మా ప్రశ్నలు…... ఇక్కడ ఎన్ని ఫిల్మ్ ఛాంబర్లు వున్నాయి అనేది ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే ఛాంబర్ కివ్వాలా లేక ఒక వ్యక్తికివ్వాలా అనేది మరో ప్రశ్న. ఢా ..దాసరి నారాయణ రావు గారి తర్వాత తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా నిలిచింది మెగాస్టారే. కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించడానికి ముందుండి సినీ కార్మికులందరినీ ఆదుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విషయం ఇటీవల వార్తల్లో కూడా చూశాం. ఇక ఇంట్లో ప్రైవేట్ గా జరిపారు అనే విషయం మీద మాట్లాడదాం. ఇంట్లో ప్రైవేటుగా జరిపితే నష్టమేంటి? మీకేం ఆలోచన వుందని మీరు ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు? ఫిల్మ్ ఛాంబర్ లో క్యూబ్, యు.ఎఫ్.ఓ ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దాన్ని తగ్గించమని చిన్న నిర్మాతలు డిజిటల్ వచ్చినప్పటి నుంచి గగ్గోలు పెడుతున్నారు. ఆ ఎలక్షన్ల ముందు మాత్రం ఏదో ఉద్దరిస్తామని మాట్లాడతారు ఆ తర్వాత ఆ ఊసే వుండదు. ఏం మీరు పదవిలో వున్నప్పుడు ధర్నాలు చేయండి. నిరాహార దీక్షలు చెసి వాళ్ల మెడలు వంచలేరా? అలా చెయ్యలేనప్పుడు మీకు ఆ పదవులెందుకు? అలాగే నిర్మాతల తరపున ఓటీటీ పెడుతున్నాం. అందరికీ న్యాయం చేస్తాం అంటారు. ఆ తర్వాత ఆ ఊసే వుండదు. అసలు మీరు ఆ సీట్లో కూర్చొని ఏం చేశారో ఒక్కసారి చెప్పండి. (చిన్న సినిమాల ఆడియో ఫంక్షన్లకెళ్లి మాట్లాడం, ఓపెనింగులు చేయడం తప్ప). ఇక ఫిల్మ్ ఛాంబర్ గురించి మాట్లాడుకుందాం. ఛాంబర్ గురించి మాట్లాడే ముందు మీరు ఛాంబర్ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మీరేమైనా వెళ్లి టిక్కెట్ల ధరలు పెరిగాయి అని ఎప్పుడైనా రెప్రజెంటేషన్ ఇచ్చారా? మీరంతకు మీరు తడిబట్టేసుకొని పడుకొని ఇప్పుడొచ్చి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అసలు ఛాంబర్ లో మీటింగులు పెడితే సజావుగా సాగుతాయా? మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఒక్క సినిమా తీయకపోయినా , చాంబర్ లో ప్రతి ఒక్కరూ హీరోలే. సమస్యల గురించి మాట్లాడాలా? లేక అరకొర తెలిసిన మీరు అడిగే ప్రశ్నలకు మీకు సమాధానం చెబుతూ, మీకు నాలెడ్జిని పంచాలా? ఇవన్నీ బేరిజు వేసుకొనే మెగాస్టార్ కొంతమంది ప్రముఖులతో ఇంట్లో సమావేశమయ్యారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి పిలుపును పంపించింది ఫిల్మ్ ఛాంబర్ కు కాదు. మెగాస్టార్ కు. కాబట్టి ఎక్కడ సమావేశం పెట్టాలి అనేది ఆయనిష్టం. పబ్లిసిటీ కోసం ఏదో మాట్లాడాలని ఇంకోసారి దయచేసి ఇలాంటి ప్రెస్ మీట్ లు పెట్టి మన తెలుగు సినిమా స్థాయి దిగజార్ఛవద్దు అంటూ మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
Social Plugin