సత్యదేవ్ తాజాగా నటించిన తిమ్మరుసు చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించినంత విజయం సాధించకపోయినా సత్యదేవ్ రేటు మాత్రం తగ్గట్లేదు. ఆయన నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ను శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా 5 కోట్లకు మ్యాంగో రామ్ దక్కించుకున్నట్టు తెలిసింది. దాని మీద ఇంకొంత పర్సెంటేజీ వేసుకొని ఆయన వేరే ఓటీటీ ఛానెల్స్ కు అమ్ముకుంటారు. కన్నడ రీమేక్ అయిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె కేన్సర్ పేషంట్ గా నటిస్తోంది. ఈ గెటప్ కోసం ఇండియాలో పేరున్న ప్రాస్థటిక్ స్పెషల్ మేకప్ ఆర్టిస్టు ఎన్.జి. రోషన్ ను పిలిపించారని తెలిసింది. అంటే కేన్సర్ పేషంట్ గెటప్ లో తమ్మన్నా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా వున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇది చూసిన విశ్లేషకులు సత్యదేవ్ మార్కెట్ బాగానే వున్నట్టుంది. సినిమా ఫ్లాప్ అయినా (థియేటరికల్ బిజినెస్ కాకుండా) 5 కోట్ల మేర బిజినెస్ చేశాడంటే మామూలు విషయం కాదు అంటున్నారు. ఇంకా సత్యదేవ్ చేతిలో స్కైలాబ్, గాడ్సే సినిమాలున్నాయి. ఇవి కూడా విడుదలకు సిద్దంగానే వున్నట్టు తెలుస్తోంది.
Social Plugin