హీరో డాక్టర్ రాజశేఖర్ రెమ్యునరేషన్ 4 కోట్లా....? వినడానికి అందరికీ ఆశ్చర్యంగా వుంటుంది కానీ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న చిత్రం కోసం హీరో కు అన్నగా నటించే పాత్రలో రాజశేఖర్ ను చిత్ర నిర్మాతలు సంప్రదించగా ఆయన నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే రాజశేఖర్ ఇంతవరకు హీరో తప్ప మిగతా కేరెక్టర్లు చేయలేదు. ఇటీవల బోయపాటి శ్రీను కూడా విలన్ పాత్రలో చేయడానికి ఆయన్ను సంప్రదించినట్లు కానీ డీల్ కుదరనట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శ్రీవాస్ చేస్తున్న సినిమాలో ఆ పాత్ర చేయడానికి రాజశేఖర్ అంగీకరించినట్లు తెలిసింది. పాత్రకున్న ఇంపార్టెన్స్ ను బట్టి నిర్మాతలు కూడా రాజశేఖర్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే శ్రీవాస్ గతంలో గోపీచంద్ తో రూపొందించిన ‘లక్ష్యం’ సినిమాలో కూడా గోపీచంద్ అన్న పాత్రకు జగపతి బాబును ఒప్పించాడు. ఇప్పుడు మళ్లీ గోపీచంద్ కాంబినేషన్ లో రాజశేఖర్ ను ఒప్పిస్తున్నాడు. జగపతి బాబు కేరెక్టర్ రోల్స్ పోషిస్తూ ఎంత ఫేమ్ అయ్యాడో రాజశేఖర్ కూడా తన సీరియస్ నటనతో కొత్త యాంగిల్ లో కనిపిస్తాడు అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల రాజశేఖర్ హీరోగా విడుదలైన ‘శేఖర్’ సినిమా పోస్టర్ సినిమా ఇండస్ట్రీలో పాజిటివ్ వేవ్ కనబరుస్తోంది. మునుముందు రాజశేఖర్ ఎలాంటి స్టెప్ట్స్ తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.
Social Plugin