G-N7RFQXDVV7 రావు రమేష్ కి 1.5 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ అట.

Ticker

6/recent/ticker-posts

రావు రమేష్ కి 1.5 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ అట.



 రావు రమేష్ తెలుగులో ఒక విలక్షణ నటునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డిక్షన్ దగ్గర్నుంచి బాడీలాంగ్వేజ్ ఒక రకమైన పాత్రలకు సరిగ్గా సరిపోతాడు అనే ముద్ర తెలుగు ప్రేక్షకుల్లో వేశారు. అయితే తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’ కోసం శ్రీ విష్ణు, రావు రమేష్, అంజలి ప్రధాన పాత్రలుగా తెరకెక్కనుంది. మూడు పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రం తెలుగు హక్కులను గీతాఆర్ట్స్ సంస్థ చేజిక్కించుకుంది. ఇందుకోసం రావు రమేష్ ను సంప్రదించగా ఆయన తను ఆ పాత్రలో నటించడానికి 1.5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై ఆయన సన్నిహితులు ప్రస్తావిస్తూ ‘అందులో తప్పేముంది. ఆ పాత్రకున్న డిమాండ్ అలాంటిది. శ్రీ విష్ణు, అంజలితో పాటు రావు రమేష్ వుంటే సినిమాకు వెయిట్ వస్తుంది. పాత్ర కూడా పండుతుంది అనే ఉద్దేశ్యంతోనే నిర్మాతలు రమేష్ గారిని సంప్రదించారు. ఆ మటుకు రెమ్యునరేషన్ అడగడంలో తప్పులేదు అంటూ చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురు వుంటే సినిమాను థియేటర్ లో కూడా విడుదల చేయచ్చు. ఆ తర్వాత ఎటూ తమ ఓటీటీ ఛానెల్ వుంది అనే ఈ సినిమా కోసం ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆహాలో అన్ని మలయాళం సినిమాలను డబ్ చేసి విడుదల చేస్తున్న విషయం విదితమే.